హైకోర్టులో బీజేపీ నేత బీఎల్ సంతోష్‌కు ఊరట - MicTv.in - Telugu News
mictv telugu

హైకోర్టులో బీజేపీ నేత బీఎల్ సంతోష్‌కు ఊరట

November 25, 2022

సంచలనం సృష్టిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈనెల 28న విచారణకు రావాలని సిట్ పోలీసులు జారీచేసిన 41 (ఏ) సీఆర్పీసీ నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. కేసు విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసింది. ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సంతోష్ విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు రెండు సార్లు నోటీసులు జారీ చేసారు.

దీనిపై సంతోష్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు స్టే విధించింది. బీఎల్ సంతోష్ తరపున న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు .ఫిర్యాదులో బీఎల్ సంతోష్ పేరు లేనప్పుడు నిందితుల జాబితాలో ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. అదేవిధంగా బీఎల్ సంతోష్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను ప్రస్తావించిన ఏజీ.సంతోష్ ప్రమేయంపై పక్కా ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. బీఎల్ సంతోష్ విచారణకు వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని ఏజీ వాదనలు వినిపించారు.ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం నోటీసులపై స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.