వారందరికీ రూ.1500..హైకోర్టు ఆదేశం
లాక్‌డౌన్ అమల్లో ఉన్నవేళ కొందరు తెల్లరేషన్ కార్డుదారులకు రూ.1500 నిలిపివేయడంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా రేషన్ తో సంబంధం లేకుండా తెల్లకార్డున్న వారందరికీ రూ.1500 ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మూడు నెలలుగా రేషన్ తీసుకోలేదన్న కారణంగా రూ.1500 ఇవ్వలేదని పిటిషన్ దారు పిటిషన్ లో పేర్కొన్నారు. రూ.1500లు నిలిపివేసే ముందు లాక్ డౌన్ లో పేదల పరిస్థితి ఆలోచించాల్సిందని హైకోర్టు తెలిపింది. కనీసం నోటీసు ఇవ్వకుండా 8 లక్షల కార్డులు ఎలా రద్దు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెల్లరేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయలేదని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. అయితే, ఎందుకు నిలిపివేశారో పూర్తి వివరాలు నివేదించడానికి అడ్వొకేట్ జనరల్ గడువు కావాలన్నారు. దీంతో హైకోర్టు విచారణను జూన్ 2కి వాయిదా వేసింది.