ఆర్టీసీ సమ్మె.. సుప్రీం మాజీ జడ్జీలతో కమిటీ! - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ సమ్మె.. సుప్రీం మాజీ జడ్జీలతో కమిటీ!

November 12, 2019

తెలంగాణ ఆర్టీసీ సమ్మె కేసుపై ఈ రోజు కూడా హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం, కార్మికులు వెనక్కి తగ్గడకపోవడంతో సమస్య పరిష్కారం కోసం ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ జడ్జీలతో కమిటీ వేస్తామని, దీనిపై ప్రభుత్వ అభిప్రాయం ఏంటో రేపు చెప్పాలని అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది. విచారణలో సమ్మె చట్టబద్ధత అంశం మరోసారి ప్రస్తానవనకు వచ్చింది. గతంలోనూ ఆర్టీసీ ఉద్యోగులపై ఎస్మాను ప్రయోగించారని, ఈసారి కూడా ప్రయోగించడానికి అనుమతి ఇవ్వాలని సీనియర్ కౌన్సిల్ విద్యాసాగర్‌ కోరారు. అయితే గతంలో ఏపీఎస్‌ ఆర్టీసీపై ఎస్మా ప్రయోగించారని, అది టీఎస్‌ఆర్టీసీకి ఎలా వర్తిస్తుందని హైకోర్టు ప్రశ్నించింది.

Telangana high court to form.

కాగా, బస్సుల్లో అధిక ఛార్జీలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మరో న్యాయవాది శశికిరణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ అంశంపై వినియోగదారుల ఫోరానికి వెళ్లాలని, దాన్ని సాకుగా చూసి సమ్మెను చట్ట విరుద్ధమని ప్రకటించలేమని హైకోర్టు పేర్కొంది. సుప్రీం మాజీ జడ్జీలతో కమిటీ ఏర్పాటుపై రేపు తమ అభిప్రాయం చెబుతామని, కోర్టు నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి చెప్పారు.