టీఆర్‌టీ నోటిఫికేషన్‌కు తొలగిన అడ్డంకి - MicTv.in - Telugu News
mictv telugu

 టీఆర్‌టీ నోటిఫికేషన్‌కు తొలగిన అడ్డంకి

November 2, 2017

తెలంగాణ ఉపాధ్యాయ నిమామక పరీక్ష టీఆర్‌టీ నోటిఫికేషన్‌కు హైకోర్టులో ఎదురైన అడ్డంకి తొలగిపోయింది. కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్లు జారీ చేయాలని దాఖలైన వ్యాఖ్యాన్ని హైకోర్టు గురువారం కొట్టేసింది. అన్ని అంశాలను పరిశీలించే నోటిఫికేషన్ ఇచ్చామన్న టీఎస్ పీఎస్పీ వాదనతో కోర్టు ఏకీభవించింది. 8వేలకుపైగా టీచర్ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ జారీచేయడం తెలిసిందే.