Telangana High Court verdict today in MLA purchase case
mictv telugu

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు హైకోర్టు కీలక తీర్పు

December 26, 2022

Telangana High Court verdict today in MLA purchase case

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐతో విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 16న జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్.. ఇరుపక్షాల వాదనలపై తీర్పును రిజర్వ్ చేసి.. ఈ రోజు(డిసెంబర్ 27) మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. ఈ క్రమంలో నేడు హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది.

ఈ కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థ లేదా సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు, నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో వివరాలు ఎలా బయటపెడతారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. వీడియోలు, ఆడియోలు దర్యాప్తు దశలోనే లీక్ అవ్వడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇక, ఈ ఏడాది అక్టోబర్ 26వ తేదీన మొయినాబాద్‌లోని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో.. ఎమ్మెల్యేలను ప్రలోభాలను గురి చేస్తున్నారనే ఆరోపణలతో రామచంద్రభారతి, నందకుమార్, సింహాయాజీలను పోలీసులు అరెస్ట్ చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలెల్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ తో కాకుండా సీబీఐ విచారణ చేయించాలని బీజేపీ పిటిషన్ వేసింది. ఇదే కేసులో మరికొందరు కూడా సిట్ విచారణ కాకుండా సిబీఐ విచారణ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు.