ప్రజలు తిరగబడితే.. సమ్మెపై ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరిక..  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రజలు తిరగబడితే.. సమ్మెపై ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరిక.. 

October 18, 2019

Telangana highcourt on rtc workers strike 

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రెండు వారాలుగా సమ్మె జరుగుతోంటే ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడింది. కార్మికుల డిమాండ్లలో అత్యధికం పరిష్కరించదగ్గవేనని, వాటి విషయంలో ఏం చేశారని ప్రశ్నించింది. ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీని నియమించకపోవడాన్నీ తప్పుబట్టింది. 

‘ఎండీని ఇంకా ఎందుకు నియమించలేదు. పూర్తిస్థాయి ఎండీ ఉంటే, సమస్యల పరిష్కారానికి ముందడుగు పడుతుంది. ఎండీ నియమాకం ఒక్కటే పరిష్కారం కాదు. రెండు వారాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్రు. అసలు మీరు సమ్మెను ఎందుకు ఆపలేకపోయారు? కార్మికుల సమస్యలను ఎందుకు పరిష్కరించలేదు. వారికికి ఆరోగ్యశ్రీ కార్డుల మంజూరులో ఎందుకు జాప్యం జరుగుతోంది’ అని ప్రశ్నించింది. ప్రజలు తిరగబడితే ఎవరూ ఆపలేరని, సమ్మెకు మరికొందరు మద్దతు తెలిపితే ఆందోళనలను పరిస్థితి చేజూరుతుందని హెచ్చరించింది. సమ్మె నివారణకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం వివరించింది. ఆర్టీసీ ఆర్థిక స్థితులు బాగా లేవని, తాము చేయూత అందిస్తున్నామని ఒక నివేదికను సమర్పించింది.  ఉద్యోగులకు 44% స్పెషల్ ఫిట్‌మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చామని,67 శాతం జీతాలను పెంచామని తెలిపింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీకి 750 కోట్లు ఖర్చు పెడితే, తెలంగాణా ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు ఇచ్చిందని చెప్పింది.