Telangana higher education council decision to put smart chip in certificates
mictv telugu

సర్టిఫికెట్లలో చిప్.. నకిలీలకు చెక్ పెట్టేలా యూనివర్సిటీల నిర్ణయం

November 21, 2022

ఏటికేడు పెరిగిపోతున్న నకిలీ సర్టిఫికెట్ల బెడదకు ముగింపు పలికేలా తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్ధులకు జారీ చేసే సర్టిఫికెట్లలో స్మార్ట్ చిప్ అమర్చాలని విశ్వవిద్యాలయాలతో కలిసి నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టాయి. ఇప్పటివరకు అమలులో ఉన్న లోగోలు, వాటర్ మార్స్క్, యూనిక్ కోడ్ నెంబర్లు, పేపర్ థిక్ నెస్ వంటి వాటితో కూడా నకిలీ సర్టిఫికెట్లు రావడంతో మోసాలు జరుగుతున్నాయి.

అసలేదో, నకిలీ ఏదో గుర్తించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో టీఎస్సీహెచ్ఈ, యూనివర్సిటీలు సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. డిప్లొమా, డిగ్రీ, ఇతర కోర్సుల సర్టిఫికెట్లను చిప్ అమర్చి జారీ చేయనున్నారు. ఇక సర్టిఫికెట్ల ఆన్ లైన్ విధానాన్ని నవంబర్ 18న ప్రారంభించగా, మొత్తం 20 లక్షల సర్టిఫికెట్లను ఆన్ లైన్ చేయాలని టీఎస్సీహెచ్ఈ టార్గెట్ గా పెట్టుకుంది. దీని ద్వారా దేశంలోనూ, ఇతర దేశాల్లో విద్యా, ఉద్యోగాల కోసం వెళ్లేవారికి సహయకంగా ఉండనుంది. కాగా, 2010 నుంచి 2021 వరకు 25 లక్షల మంది విద్యార్ధులు తమ డిగ్రీని పూర్తి చేశారు.