రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం(మే 18 న) నిర్ణయం తీసుకుంది. పెరిగిన మద్యం ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో మద్యం ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
• రూ. 200 లోపు ఎంఆర్పీ ఉన్న 180ML పై రూ. 20,
• రూ. 200 లోపు ఎంఆర్పీ ఉన్న 375ML పై రూ. 40,
• రూ. 200 లోపు ఎంఆర్పీ ఉన్న 750ML పై రూ. 80 పెంచింది.
• రూ. 200 కంటే ఎక్కువ ఎంఆర్పీ ఉన్న 180ML పై రూ. 40,
• రూ. 200 కంటే ఎక్కువ ఎంఆర్పీ ఉన్న 375ML పై రూ. 80,
• రూ. 200 కంటే ఎక్కువ ఎంఆర్పీ ఉన్న750ML పై రూ. 160 పెంచింది.
అన్ని రకాల బీర్ బాటిల్ ఎంఆర్పీపై రూ. 10 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. చివరి సారిగా 2020, మే నెలలో తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. పాత ఎంఆర్పీలు ఉన్నా కొత్త ధరలు వర్తిసాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.