Telangana: Home Department clarification on DSP posting
mictv telugu

తెలంగాణ: డీఎస్పీ పోస్టింగ్‌పై హోంశాఖ స్పష్టత

July 21, 2022

తెలంగాణ రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా డీఎస్పీ సర్వీస్ అంశంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. డీఎస్పీల సర్వీస్‌ను అధికారులు ఎలా నియమిస్తారు? పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు? అని పలు సందేహాలతో అధికారుల్లో సంగ్ధిత నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్ర హూంశాఖ తాజాగా ఓ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్పీ సర్వీస్‌కు సంబంధించిన పూర్తి స్పష్టతను అందులో వివరించింది.

”ఎంపిక సమయంలో వీరిని మల్టీజోనల్ కేడర్‌గా, పోస్టింగ్ అప్పుడు మాత్రం రాష్ట్రస్థాయి కేడర్‌గా పరిగణించాలని నిర్ణయించాం. ఆపాయింటింగ్ ఆథారిటీలను నియమిస్తూ ఇటీవలే ఉత్తర్వులు కూడా జారీ చేశాం. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని ఈ నిబంధనల్ని రూపొందించాం. ఇకపై రాష్ట్రంలో జరిగే డీఎస్పీల నియామక సమయంలో మల్టీ జోనల్ స్థాయిలో ఉన్న ఖాళీలనే పరిగణనలోకి తీసుకొని పోస్టుల సంఖ్యను నిర్ణయిస్తా. అంతకుముందు రాష్ట్రస్థాయిలోని ఖాళీలను పరిగణనలోకి తీసుకునేవారు. పదోన్నతులు, బదిలీలు, క్రమశిక్షణ చర్యలు, ఇలా అన్ని అంశాలను సంబంధిత ఆపాయింటింగ్ అధారిటీలే పర్యవేక్షిస్తాయి. అన్ని విభాగాల హెచ్‌వోడీలు, రాష్ట్రస్థాయి ప్రత్యేక అధికారుల నియామకాలు, పోస్టింగ్‌లు యథావిధిగానే ఉంటాయి” అని అధికారులు పేర్కొన్నారు.