ఇంటికే ఉచితంగా కరోనా ఐసోలేషన్ కిట్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇంటికే ఉచితంగా కరోనా ఐసోలేషన్ కిట్..

July 11, 2020

n vg nb

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న కరోనా పేషంట్లకు ఉచితంగా కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 10 వేల మందికి పైగా కరోనా పేషంట్లు హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. 

ఈ క్రమంలోనే వారికి ఉచితంగా కరోనా ఐసొలేషన్ కిట్లను సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందులో పదిహేడు రోజులకు సరిపోయే మందులను పంపిణీ చేయనున్నారు. ఇందులో మాస్కులు, శానిటైజర్లు, హైడ్రాక్సీక్లోరోక్విన్, పారాసెటమాల్, యాంటి బయాటిక్స్, విటమిన్ టాబ్లెట్లు, ఎసిడిటీ తగ్గించే టాబ్లెట్లతో పాటు ఏం చేయాలి.. ఏం చేయకూడదు లాంటి విషయాలపై అవగాహన కల్పించే ఓ పుస్తకం లాంటివి ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ తరహా కిట్ ను అందిస్తోంది.