జూబ్లీహిల్స్ రేప్ కేసు విషయంలో తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఈ దుర్ఘటనలో తన మనవడు లేడని స్పష్టం చేశారు. తన మనవడిపై కావాలనే దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. సామూహిక అత్యాచారం చాలా దురదృష్టకరమని, ఈ కేసులో పోలీసులు చాలా బాగా విచారణ చేస్తున్నారని పేర్కొన్నారు. కేసును డైవర్ట్ చేస్తున్నారనే విపక్షాల ఆరోపణల్లో నిజం లేదని, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
కేసులో ఓ నిందితుడి తండ్రి అయిన వక్ఫ్ బోర్డు చైర్మెన్ పదవిని తొలగించే అధికారం తనకు లేదని, ఈ విషయంలో బోర్డు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. కాగా, పిల్లల విషయంలో వారి తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని, వారి కదలికలపై జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.