Telangana: IAS officers transferred to new posts across state
mictv telugu

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు

June 12, 2022

Telangana: IAS officers transferred to new posts across state

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 8 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో భాగంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌‌గా ఉన్న ఎ.శరత్‌ను సంగారెడ్డి కలెక్టర్‌గా బదిలీ చేశారు. సంగారెడ్డి కలెక్టర్ ఎం హనుమంత రావు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కొత్త డైరెక్టర్‌గా నియమితులయ్యారు. నల్గొండ జిల్లా కలెక్టర్ పాటిల్ ప్రశాంత్ జీవన్‌ను సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా నియమించారు. నల్గొండ లోకల్‌ బాడిస్‌ అదనపు కలెక్టర్‌గా ఉన్న రాహుల్‌శర్మకు నల్గొండ కలెక్టర్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. జోగులాంబ- గద్వాల లోకల్‌బాడిస్‌ అదనపు కలెక్టర్‌గా ఉన్న కోయ శ్రీహర్షకు కలెక్టర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. కుమురం భీం-ఆసిఫాబాద్‌ లోకల్‌బాడిస్‌ అదనపు కలెక్టర్‌గా ఉన్న వరుణ్‌రెడ్డిని ఉట్నూరు ఐటీడీఏ పీవోగా బదిలీ చేశారు. ఉట్నూరు ఐటీడీఏ పీవోగా ఉన్న అంకిత్‌ను ఏటూరు నాగారం పీవోగా బదిలీ చేశారు. కుమురం భీం- ఆసిఫాబాద్‌ లోకల్‌బాడి అడిషినల్‌ కలెక్టర్‌గా చహత్‌ బాజ్‌పాయ్‌ను బదిలీ చేశారు.