తెలంగాణలో 2023లో జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ని ఇంటర్ బోర్డు సోమవారం ప్రకటించింది. ఫస్టియర్ పరీక్షలు మార్చి 15న ప్రారంభమై ఏప్రిల్ 3న ముగుస్తాయి. సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 15న మొదలై ఏప్రిల్ 4న పూర్తవుతాయి. ఈ పరీక్షలను ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష మార్చి 4వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ఇక ప్రాక్టికల్స్ విషయానికి వస్తే ఫిబ్రవరి 15న ప్రారంభమై మార్చి 2 వరకు ముగుస్తాయి. పూర్తి వివరాలకు కింద ఇచ్చిన షెడ్యూల్ ని చూసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి :