ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా - MicTv.in - Telugu News
mictv telugu

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా

May 21, 2019

Telangana intermediate board postponed supplementary examinations

తెలంగాణలో మే 25 నుంచి జరగాల్సిన ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. జూన్‌ 7 నుంచి 14 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇంటర్‌బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

జూన్‌ 15 నుంచి 18 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌, జూన్‌ 19న నైతిక, మానవ విలువలు, జూన్‌ 20న పర్యావరణ విద్య పరీక్ష నిర్వహించనున్నారు. మొదట వెలువడిన ఇంటర్‌ ఫలితాల్లో తప్పులు రావడంతో రాష్ట్రంలో పెను రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో జవాబు పత్రాలను మళ్ళీ మూల్యాంకన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25 నుంచి నిర్వహించాల్సిన అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలను మరోసారి వాయిదా వేశారు.