తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇదే..  - MicTv.in - Telugu News
mictv telugu

 తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇదే.. 

November 29, 2019

Telangana1

తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు అధికారులు విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 4 నుంచి 21 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఉంటాయి. రెండో సంవత్సరం పరీక్షలను మార్చి 5 నుంచి 23 వరకు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి.  జనవరి 28న నైతిక, మానవ విలువల(ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్) పరీక్ష, జనవరి 30న పర్యావరణ విద్య(ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్) పరీక్ష ఉంటుంది.