తెలంగా రాష్ట్రంలో డిగ్రీ విద్యార్థినీ, విద్యార్థులకు విద్యను బోధించాలని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఖైరతాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళశాల, నారాయణగూడలోని బాబు జగ్జీవన్ రామ్ ప్రభుత్వ డిగ్రీ కళశాలల యాజమాన్యాలు శుభవార్త చెప్పాయి. తమ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మంగళవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశాయి.
మొదటగా…ఖైరతాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ బి. రాజేంద్రకుమార్ తెలిపారు. ”సంస్కృతం-1, టాక్సేషన్-1, స్టాటటిక్స్-1, బిజినెస్ అనాలసిస్-2, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్-5, డేటా సైన్స్-1 ఖాళీలు ఉన్నాయి. జనరల్ కేటగిరి వారు సంబంధిత సబ్జెక్టుల్లో 55 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉన్న వారు అర్హులు. పీహెచ్డీ, ఎస్ఈటీ, ఎస్ఎల్ఈటీ, యూజీ అర్హులైన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ధ్రువపత్రాలతో ఈనెల 28న సాయంత్రం 5 గంటలలోపు కళాశాలలో సంప్రదించండి. 29న ఉదయం 10 గంటలకు జరిగే ముఖాముఖీలకు హాజరు కావాలి” అని ఆమె అన్నారు.
అనంతరం నారాయణగూడలోని బాబు జగ్జీవన్ రామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకులుగా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. గీతాలక్ష్మీ పట్నాయక్ వెల్లడించారు. అర్హులైన అభ్యర్ధులు ఈనెల 28 సాయంత్రం 5 గంటలలోపు కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఆంగ్లం-2 తెలుగు-1, సంస్కృతం-1, బిజినెస్ అడ్మినిస్ట్రే షన్-2, గణితం-1, స్టాటిస్టిక్స్-1, అప్లయిడ్ న్యూట్రిషన్-1, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్- 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.