Telangana IT Minister KTR interesting tweet about Vizag
mictv telugu

యంగర్ బ్రదర్ వైజాగ్‎కు ఆల్ ది బెస్ట్…కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్..!!

March 2, 2023

Telangana IT Minister KTR interesting tweet about Vizag

ఏపీకి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మార్చి 3, 4వ తేదీల్లో విశాఖ వేదికగా ఈ సమ్మిట్ ను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఏపీరాష్ట్రానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదికగా రాష్ట్రంలో వనరుల గురించి పారిశ్రామికవేత్తలకు వివరించడంతోపాటుగా పెద్దెత్తున పెట్టుబడులను ఆకర్షించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.

ఈ క్రమంలోనే హైదరాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఏపీ ఐటీ శాఖమంత్రి గుడివాడ అమరనాథ్ పాల్గొన్నారు. హైదరాబాద్ ఏపీకి పెద్దన్నగా అభివర్ణించారు. హైదరాబాద్ డెవలప్ మెంట్ చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నట్లు పేర్కొన్నారు. ఉత్తరాది దక్షిణాదితో కలిసే హైదరాబాద్ లో ఏపీ ప్రమోట్ చేస్తానని నేను ఊహించలేదన్నారు. జీవశాస్త్రం సాంకేతికతను కలుసుకుంటుంది. లైఫ్ సైన్సులు, డేటా సైన్సును వివాహం చేసుకుంటాయి. మా పెద్దన్న డెవలప్ మెంట్ చూసి గర్వపడుతున్నామన్నారు అమరనాథ్ .

దీనికి సంబంధించిన పేపర్ క్లిప్ ను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్..విశాఖను తమ యంగ్ర బ్రదర్ గా పేర్కొన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్న తమ యంగర్ బ్రదర్ వైజాగ్ కు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంగా అత్యుత్తమంగా ఉండాలంటూప ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు కేటీఆర్.