స్మృతి ఇరానీతో మంత్రి కేటీఆర్ భేటీ - MicTv.in - Telugu News
mictv telugu

స్మృతి ఇరానీతో మంత్రి కేటీఆర్ భేటీ

November 26, 2019

telangana it minister ktr met with union minister smriti irani.

తెలంగాణ ఐటీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఈరోజు కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయ్యారు. వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్కుకు కేంద్రం సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. సిరిసిల్లలో సీపీసీడీఎస్‌ పథకం కింద మెగా పవర్‌ లూమ్‌ క్లస్టర్‌ మంజూరు చేయాలని కేంద్రమంత్రికి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మర్యాపూర్వకంగా స్మృతి ఇరానీని ఆయన సత్కరించారు. 

2017లో వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ శంకుస్థాపన జరిగింది. ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి కేటీఆర్ సమక్షంలో 22 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. వెల్స్ వన్ గ్రూప్ రూ. 750 కోట్లు, నందన్ డెనిమ్ (చిరిపాల్ గ్రూప్) రూ. 700 కోట్లు, అర్బక్ నిట్ ఫ్యాబ్స్ రూ. 125 కోట్లు, శివానీ గ్రూప్ రూ. 120 కోట్లు, గిన్నీ ఫిలమెంట్స్ రూ. 100 కోట్లు, స్వయంవర్ గ్రూప్ రూ. 50 కోట్లు, శ్రీనాథ్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ రూ. 50 కోట్లు, షాహీ ఎక్స్ పోర్ట్స్ రూ. 45 కోట్లు, సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్స్ రూ. 25 కోట్లు, జేకాట్ ఇండ్రస్ట్రీస్ రూ. 20 కోట్లు, జీకే థ్రెడ్స్ రూ. 15 కోట్లు, సూర్యోదయ్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ రూ. 10 కోట్లు, గోకాల్డస్ ఇమేజస్ రూ. 10 కోట్లు వాటిలో ముఖ్యమైనవి. ఇవే కాకుండా మరిన్ని కంపెనీలు కూడా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.