కోదండరామ్ అరెస్ట్… హైదరాబాద్ కు తరలింపు.

ముందు జాగ్రత్త చర్యగా జేఏసీ ఛీఫ్ కోదండరాంను అదుపులోకి తీుకున్నారు పోలీసులు. కామరెడ్డి లో తలపెట్టిన స్పూర్తి యాత్రను పోలీసులు భగ్నం చేశారు. కోదండరాం కామరెడ్డికి చేరుకోకముందే బిక్కునూర్ లో అడ్డవేసిన పోలీసులు,వాహనాలకు అనుమతులు లేవని కోదండరామ్ తో పాటు జేఎసీ నాయకుల అరెస్ట్ చేశారు. మరో వైపు టీఆర్ఎస్ పార్టీ కార్యక్తలకు జేఎసీ నాయకులకు కామరెడ్డి కేంద్రంలో కొట్లాట చోటుచేసుకుంది. జేఎసీ మీటింగ్ కోసం వేసిన టెంట్ ను టీఆర్ఎస్ నాయకులు పీకిపారేశారు. అయితే కోదండరాంను అదుపులోకి తీసుకున్న పోలీసులు అయన్ను ఎక్కడికి తీసుకుపోతారో అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. అయితే హైదరాబాద్ లోని కోదండరాం ఇంటి దేగ్గర దిగపేట్టే చాన్స్ ఉందని తెలుస్తుంది.

నిజాంబాద్ జిల్లాలో జరుగు అమరుల స్ఫూర్తి యాత్ర ను బస్వాపూర్ లో అడ్డుకుంటున్న తెరాస పార్టీ వాళ్ళు

Posted by Professor Kodandaram Fans Page on Thursday, 10 August 2017

SHARE