బతుకమ్మ పండుగ తేదీలు ఇవే.. కవిత వెల్లడి  - MicTv.in - Telugu News
mictv telugu

బతుకమ్మ పండుగ తేదీలు ఇవే.. కవిత వెల్లడి 

September 14, 2020

Telangana Jagruthi Leader Kavita Press Meet On Bathukamma Festival’s Dates

తెలంగాణ రాష్ట్ర పూలపండగ బతుకమ్మ వేడుకపై నెలకొన్న సందిగ్ధానికి పండితులు తెరదించారు. పండగను ఎప్పటి నుంచి ఎప్పటివరకు వరకు జరుపుకోవాలో చెప్పారు. తెలగాంగా జాగృతి నాయకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ రోజు ‘తెలంగాణ విద్వత్సభ’కు చెందిన పండితులతో, జ్యోతిష్యుతో చర్చంచి, తర్వాత విలేకర్ల సమావేశం మాట్లాడారు. 

బతుకమ్మను అక్టోబర్ 16 నుంచి 24 తేదీ వరకు జరుపుకోవాలని ఆమె సూచిచారు.  ‘ఈ పండగ తెలంగాణకే తలమానికం. తెలంగాణ జాగృతి చాలా సంవత్సరాల నుంచి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తుండటంతో చాలా మంది బతుకమ్మ తేదీల గురించి మమ్మల్ని సంప్రదించారు. తెలంగాణ విద్వత్సభ సలహా మేరకు అక్టోబర్ 16 తేదీన బతుకమ్మ పండుగను ప్రారంభించి, అక్టోబర్ 24 తేదీ వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నిర్వహించాలి. ప్రతి 19 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి పరిస్థితి ఎదురౌతుంది. శాస్త్ర ప్రకారం ఇందులో ఎలాంటి తప్పు లేదని వేద పండితులు తెలిపారు..’ అని ఆమె తెలిపారు. అధిక ఈశ్వీయుజ మాసం కారణంగా శాస్త్ర ప్రకారం పండుగ తేదీల్లో మార్పులు చేసినట్లు  పండితులు వెల్లడించారు. సమావేశంలో తెలంగాణ విద్వత్సభ రాష్ట్ర అధ్యక్షులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి, తెలంగాణ రాష్ట్ర  బ్రాహ్మణ సేవాసంఘాల సమాఖ్య అధ్యక్షులు వెన్నంపల్లి జగన్మోహన శర్మ, ఇతర పండితులు పాల్గొన్నారు.