తెలంగాణ జనసమితి జెండాలో సర్వం సకలం - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ జనసమితి జెండాలో సర్వం సకలం

April 4, 2018

ప్రొఫెసర్ కోదండరాం ఏర్పాటు చేసిన తెలంగాణ జనసమితి పార్టీ జెండాను ఈ రోజు హైదరాబాద్ ఆర్టీసీ కల్యాణ మండపంలో ఆవిష్కరించారు. ఇది తెలంగాణ సమాజం, సంస్కృతికి అద్దం పడుతుందని కోదండరాం అన్నారు. లేత, ముదురు నీలం, పసుపు, ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో, తెలంగాణ మ్యాప్ బ్యాంగ్రౌండ్‌తో దీన్ని రూపొందించారు.కోదండరాం మాట్లాడుతూ.. ‘ఇందులో పాలపిట్ట(నీలం) రంగు ఉంది. ఇది విజయానికి, ఆలోచనకు ప్రతీక. నీలిరంగు దళితవాదానికి కూడా ప్రతీక. ఇందులో ఎరుపు సూర్యుడు ఉన్నాడు. తెల్లటి మల్లెపువ్వు ఉంది. అది అమరుల స్తూపంపై ఉన్నది. దాని చుట్టూ ఉన్నవారు అమరులను స్మరిస్తూ తిరుగుతున్న ప్రజలు. ఎరుపు తెలంగాణ ఆకాంక్షలకు ప్రతిరూపం.. ఆకుపచ్చ అభివృద్ధికి చిహ్నం. ’ అని వివరించారు.