అలర్ట్.. మరో నెల రోజుల్లో ఇంటర్ తరగతులు ప్రారంభం - MicTv.in - Telugu News
mictv telugu

అలర్ట్.. మరో నెల రోజుల్లో ఇంటర్ తరగతులు ప్రారంభం

May 16, 2022

Telangana: Junior colleges to reopen on June 15

వచ్చే నెల జూన్ 15వ తేదీ నుంచి ఇంటర్‌ సెకండ్ ఇయర్ క్లాసులు ప్రారంభమవుతాయని తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించింది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి షెడ్యూల్‌ను ఖరారు చేసిన ఇంటర్మీడియట్‌ బోర్డు.. 221 పని రోజులతో ఇంటర్ విద్యా సంవత్సరం ఉంటుందని సోమవారం ప్రకటించింది. జులై 1 న ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులను ప్రారంభిస్తామని, అక్టోబర్‌ 2 నుంచి 9 వరకు ఇంటర్‌ విద్యార్థులకు దసరా సెలవులు, 2023, జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని పేర్కొంది.

‘ఫిబ్రవరి 6 నుంచి 13 వరకు ప్రీఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులుంటాయని, 2023 మే చివరి వారంలో ఇంటర్ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది.