అపురూపం.. ఎల్లంపల్లి నుంచి కాళేళ్వరంలోకి నీళ్లు - MicTv.in - Telugu News
mictv telugu

అపురూపం.. ఎల్లంపల్లి నుంచి కాళేళ్వరంలోకి నీళ్లు

April 17, 2019

తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామం చేసే ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో ఈ రోజు చరిత్రలో నిలిపోయే ఘట్టం ఆవిష్కృతమైంది. పరీక్షల్లో భాగంగా అధికారులు వెట్‌ రన్‌ కోసం ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం ఆరో ప్యాకేజీ సొరంగంలోకి నీటిని విజయవంతంగా  విడుదల చేశారు. ఈ నీళ్లు నాలుగైదు రోజుల్లో నందిమేడారంలోని సర్జ్ పూల్‌కు చేరుతాయి. పరీక్షలకు ముందు ఇంజినీర్లు అన్ని జాగ్రత్తలూ తీసుకుని వేమునూరు రెగ్యులేటర్‌ వద్ద అధికారులు పూజలు నిర్వహించారు. 

1.1 కిలోమీటర్ల  గ్రావిటీ కాలువ గుండా గోదావరి జలాలు జంట సొరంగాల్లోకి వెళ్తాయి. 11 మీటర్ల డయాతో కూడిన ఒక్కో సొరంగం( 9.534 కిలోమీటర్లు) ద్వారా నీళ్లు నందిమేడానికి వెళ్తాడు. అక్కడి పంప్పు హౌజ్‌లో 124.4 మెగావాట్లతో కూడిన మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తదారు. దీనికోసం ఎల్లంపల్లి నుంచి 0.2 టీఎంసీ నీటిని విడుదల చేశారు.  జలాల్ని మాత్రమే విడుదల చేశారు. నీటి విడుదల కంటే ముందు పాలకుర్తి మండలం వేమునూరు రెగ్యులేటర్‌ వద్ద అధికారులు పూజలు నిర్వహించారు.