Telangana: Kawal Tiger Reserve website launched
mictv telugu

తెలంగాణ: కవాల్‌ టైగర్‌ రిజర్వ్‌ వెబ్‌సైట్‌ ప్రారంభం

September 1, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అడవులు, పార్కులు, జలపాతాలు, కవాల్‌ పులుల రక్షిత ప్రాంతాలకు సంబంధించి, అటవీ శాఖ అధికారులు ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్ ద్వారా రాష్ట్రంలో ఉన్న అడవులు, పార్కులు, జలపాతాలు, కవాల్‌ పులుల ప్రాంతాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇందులో పొందుపరిచారు. పర్యాటకులు, సందర్శకుల ఎవరైనా ఈ ప్రదేశాలను సందర్శించే ముందు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించే ఆ ప్రదేశంలో ఉన్న ప్రత్యేకతల గురించి తెలుస్తాయని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

”పర్యాటకుల, సందర్శకుల కోసం.. కవాల్‌ అటవీ ప్రాంతం ప్రత్యేకత, విస్తరించిన ప్రాంతాలు, జంతువులు, పక్షులు, చెట్ల జాతుల వివరాలు, సందర్శనీయ స్థలాలు, ఎకో టూరిజం ప్రాంతాలు, సఫారీ, అన్‌లైన్‌ బుకింగ్‌ వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కవాల్‌టైగర్‌.కామ్‌ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. కవాల్‌ అటవీ ప్రాంతంలో అభివృద్ది చేసిన గడ్డి మైదానాలపై (గ్రాస్‌ లాండ్స్‌) ప్రత్యేక బుక్‌లెట్‌ను, రాష్ట్రంలో మరొక పులుల సంరక్షణ కేంద్రం అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు వార్షిక నివేదికను విడుదల చేశాం” అని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

పీసీసీఎఫ్‌ ఆర్‌.ఎం.డోబ్రియల్‌ మాట్లాడుతూ…”ఇక్కడ ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసిన గడ్డి మైదానాలకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోంది. జాతీయ పులుల సంక్షణ సంస్థ (ఎన్టీసీఏ) నిపుణులు సైతం ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, పీసీసీఎఫ్‌ (కంపా) లోకేశ్‌ జైశ్వాల్, అమ్రాబాద్, కవాల్‌ టైగర్‌ రిజర్వు ఫీల్డ్‌ డైరెక్టర్లు, వివిధ అటవీ సర్కిళ్ల అధికారులు పాల్గొన్నారు.