చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంగళవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. బ్లాక్ మనీ దాచుకోవడానికి మంచి చోటు గురించి చెప్పారు. అక్కడ పెడితే ఎలాంటి ఢోకా లేదని ఢంకా బజాయించి చెప్తున్నారు. ‘నల్లధనం దాచుకోవడానికి స్విస్ బ్యాంకులు, దుబాయ్ పర్యటనలు, పనామా ఛానల్ దీవులు, మారిషస్ మార్గం, బినామీ వ్యక్తులు అవసరం లేదు. బ్లాక్ మనీ, కమీషన్లు దాచుకోవడానికి తెలంగాణలోని భూములు అనువైన చోటు.
చేవెళ్ల ప్రాంతంలో భూముల అసలు మార్కెట్ విలువ ఎకరా రూ. 3 కోట్లు ఉంటే అధికారికంగా రిజిస్ట్రేషన్ల విలువ రూ. 7 లక్షలే ఉంది. అంటే రూ. 2.93 కోట్లు బ్లాక్ మనీ, రూ. 7 లక్షల వైట్ మనీతో ఎకరా కొనవచ్చు. ఏ రాష్ట్రంలో ఇంత గ్యాప్ లేదు. తెలంగాణలో మాత్రమే రిజిస్ట్రేషన్ విలువ, మార్కెట్ విలువల మధ్య 20 నుంచి 40 శాతం భారీ వ్యత్యాసం ఉంద’ని ట్వీట్ చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ గ్యాప్ జీరో అని వెల్లడించారు. అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టిన పనుల వల్లే భూముల ధరలు పెరిగాయని, టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధిని చాటి చెప్పేలా ట్వీట్ ఉందని గులాబీ పార్టీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
అటు మరికొందరు దీనిపై సీబీఐ, ఈడీ, ఐటీలతో విచారించి నల్లధనం దాచుకున్న వాళ్లను పట్టించాలని కోరుతున్నారు. ఇక మరికొంతమంది ఇప్పటి వరకు మీరు ఎన్ని ఎకరాలు కొన్నారు. ఎన్ని ఎకరాలు అమ్మారో గుండెల మీద చేయి వేసి చెప్పాలని ప్రశ్నించారు. కాగా, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.
No need of Swiss banks.
No need of Dubai trips.
No need of Panama.
No need of Channel Islands.
No need for Mauritius route.Benamis also not essential.
The best place to hide black money and kickbacks & commissions is Telangana Lands.
1/n pic.twitter.com/YLSJsPjC19
— Konda Vishweshwar Reddy (@KVishReddy) November 29, 2022