Telangana: Lasset Hall Tickets on Website
mictv telugu

తెలంగాణ: వైబ్‌సైట్‌లో లాసెట్ హాల్‌టికెట్లు

July 20, 2022

తెలంగాణ రాష్ట్రంలో రేపు నిర్వహించనున్న లాసెట్ పరీక్షకు సంబంధించి అధికారులు విద్యార్థినీ, విద్యార్థులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. లాసెట్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారికి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు.

”మూడేళ్ల లా కోర్సుకు సంబంధించిన లాసెట్ పరీక్షను ఈ నెల 21న (గురువారం) రెండు సెషన్లలో నిర్వహించనున్నాం. మొదటి సెషన్‌ ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు నిర్వహించనున్నాం. ఇక, ఐదేళ్ల లాకోర్సు, పీజీ లా కోర్సుకు సంబంధించిన లాసెట్‌ను ఈ నెల 22న నిర్వహిస్తాం” అని అధికారులు తెలిపారు.

మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వాయిదాపడ్డ వివిధ ప్రవేశ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. అనంతరం విద్యార్థులు ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను దృష్టిలో ఉంచుకొని, పరీక్షలకు హాజరుకావాలని కోరారు.

కొత్త తేదీలు ఇవే..