కర్ణాటక దొంగ ప్రాజెక్టులు కడుతోంది.. కేంద్రానికి తెలంగాణ ఫిర్యాదు - MicTv.in - Telugu News
mictv telugu

కర్ణాటక దొంగ ప్రాజెక్టులు కడుతోంది.. కేంద్రానికి తెలంగాణ ఫిర్యాదు

May 11, 2022

కర్ణాటక అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు అనుమతులపై తెలంగాణ రాష్ట్ర సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర జలసంఘానికి ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. రెండు ప్రాజెక్టులకు అనుమతులు నిలిపివేయాలంటూ ప్రాజెక్టు అప్రైజల్ డైరెక్టరేట్‌కు రాసిన ఈ లేఖలో ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) విజ్ఞప్తి చేశారు. అంతర్రాష్ట్ర అంశాలు, ట్రైబ్యునల్ తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వం… పరిగణనలోకి తీసుకోకుండా అనుమతులు ఇవ్వరాదని తెలిపింది.

ఆ ప్రాజెక్టులకు అనుమతులిస్తే కృష్ణాకు తుంగభద్ర నుంచి ప్రవాహం తగ్గుతుందని లేఖలో పేర్కొంది. దీని వల్ల రాష్ట్ర ప్రయోజనాలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రెండు ప్రాజెక్టులకు బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులు చేయలేదన్న రాష్ట్ర సర్కార్‌… బ్రిజేష్‌ ట్రైబ్యునల్ కేటాయింపులున్నా సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. దిగువ రాష్ట్రాల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సూచించింది.