తెలంగాణ భవన్‌లో విమోచన దినోత్సవం - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ భవన్‌లో విమోచన దినోత్సవం

September 17, 2020

tss

ఈరోజు తెలంగాణ ప్రజలు విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ తమ పార్టీ కార్యాలయం అయిన తెలంగాణ భవన్ లో ఈ వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకల్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. భారతదేశంలో తెలంగాణ రాష్ర్టం విలీన జరిగిన ఈరోజుని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ జాతీయ జండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. 

ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాని ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తరపున స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విమోచన ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు జి వివేక్, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు.