తెలంగాణ: ఏఈ ఉద్యోగాలకు లైన్ క్లియర్..త్వరలోనే ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ: ఏఈ ఉద్యోగాలకు లైన్ క్లియర్..త్వరలోనే ప్రకటన

July 5, 2022

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం 33 జిల్లాల నిరుద్యోగులకు అతి త్వరలోనే మరో తీపికబురు చెప్పడానికి సిద్దమైంది. ఇప్పటికే ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చింది. అందులో పోలీస్ ఉద్యోగాలు, గ్రూప్-1 ఉద్యోగాలు, విద్యుత్ శాఖ ఉద్యోగాలు ఉన్నాయి.

తాజాగా టీఎస్‌పీఎస్సీ ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి మరింత వేగం పెంచింది. మున్సిపల్, ఇరిగేషన్, ఆర్ఎండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల్లో ఖాళీగా ఉన్న ఏఈ పోస్టులను భర్తీకి చేసేందుకు టీఎస్పీఎస్సీ రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మున్సిపల్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల ఉన్నతాధికారులతో టీఎస్‌పీఎస్సీ అధికారులు సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల్లోని ఖాళీల వివరాలను సేకరించారు. ఈ పోస్టులన్నీ ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీ అధికారులు చర్చించారు. అన్నీ అనుకున్నట్టు కుదిరితే మరో 15 రోజులోనే ఈ ఏఈ పోస్టులకు సంబంధించిన ప్రకటనను ఇవ్వాలని కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.

మరోపక్క గతకొన్ని నెలలక్రితం కేసీఆర్ అసెంబ్లీలో మొత్తం 91,142 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రకటన ప్రకారమే..ఇప్పటికే 46,988 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. గ్రూప్-1, పోలీస్, విద్యుత్తు శాఖలకు సంబంధించి నోటిఫికేషన్లు వచ్చేశాయి. ఇప్పుడు మున్సిపల్, ఇరిగేషన్, ఆర్ఎండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల్లో ఖాళీగా ఉన్న ఏఈ పోస్టులకు ఆర్ధికశాఖ లైన్ క్లియర్ చేసింది. మరికొన్ని రోజులలో నోటిఫికేషన్ రాబోతుందని సూచనలు తెలియజేసింది.