తెలంగాణ: ప్రేమ, పెళ్లి, 5 రోజుల కాపురం..చివరికి - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ: ప్రేమ, పెళ్లి, 5 రోజుల కాపురం..చివరికి

July 6, 2022

తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం దేపల్లిలో ప్రేమ పేరుతో సత్యనారాయణ గౌడ్‌ (23) అనే యువకుడు ఆర్య సమాజ్‌లో తనను పెళ్లి చేసుకొని, ఐదు రోజులపాటు కాపురం చేసి, చివరికి వదిలేశాడని అదే గ్రామానికి చెందిన రేణుక (21) అనే యువతి అతని ఇంటి ముందు ధర్నా చేపట్టిన సంఘటన సంచలనంగా మారింది. ప్రేమ పేరుతో నమ్మించి, పెళ్లి చేసుకొని, తనను వాడుకొని వదిలిశాడని యువతి ఆవేదన చెందుతూ, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. దేపల్లిలో గ్రామంలో నివాసముంటున్న సత్యనారాయణగౌడ్‌ (23) అదే గ్రామానికి చెందిన రేణుక (21) అనే యువతి, యువకుడు చాలా ఏళ్లుగా ప్రేమించుకున్నారు. తాజాగా కుటుంబ సభ్యులకు వారి ప్రేమ విషయాన్ని తెలియజేశారు. దాంతో వారిపై ఆగ్రహించిన ఇరువురి కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించకలేదు. జూన్ 17న హైదరాబాద్‌లోని ఓ ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌లోనే ఓ ఇల్లును అద్దెకు తీసుకొని, సత్యనారాయణ ఐదు రోజులపాటు కాపురం చేశాడు. ఆ తర్వాత తన తండ్రికి ఆరోగ్యం బాలేదని చెప్పి, సొంత గ్రామం దేపల్లికి వచ్చి, ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకున్నాడు.

విషయం తెలుసుకున్న రేణుక.. తనను కేవలం ప్రేమ పేరుతో మోసం చేసి వాడుకుని వదిలేశాడని పోలీసులను ఆశ్రయింంది. అయినా, ఫలితం లేకపోవటంతో మంగళవారం భర్త ఇంటి ముందు భైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. తనకు తన భర్త కావాలని, తనకు న్యాయం చేసేవరకు పోరాటం ఆపానని శఫథం చేసింది. ప్రస్తుతం సత్యనారాయణను వారి బంధువులు అజ్ఞాతంలో ఉంచారని, తనకు న్యాయం చేయాలని కోరుతోంది. సీఐని ఈ విషయంపై వివరణ కోరగా ఉమెన్‌ పీఎస్‌కు రిఫర్‌ చేస్తామని ఆయన అన్నారు.