2021, 2022లో.. మరణించిన దాతల అవయవ మార్పిడిలో దేశంలోనే అత్యుత్తమ పని తీరు కనబరిచిన రాష్ట్రాలుగా తెలంగాణ, మహారాష్ట్ర నిలిచాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రవీణ్ పవార్ తెలిపారు.
ఎవరైనా చనిపోతే వారి అవయవాలు మరికొందరు ప్రాణాలను నిలబెట్టొచ్చు. కొందరికి కొత్త జీవితం ప్రసాదించవచ్చు. అవయవ దానం అనేది చాలా గొప్ప విషయం. దీని కోసం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగానే.. అవయవ మార్పిడి కోసం మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో అత్యాధునిక బహుళ అవయవ కేంద్రాన్ని నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం 35 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దేశంలోని అర్హులైన రోగులకు శవ, లైవ్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ ను సులభతరం చేయడానికి కేంద్రం తీసుకున్న చర్యలను, అవయవదానం పై అవగాహన పెంచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది.
చర్యలు..
– నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ (NOTTO) ద్వారా సమాచార వ్యాప్తి.
– ప్రాంతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (ROTTO)
– రాష్ట్ర అవయవ, కణజాల మార్పిడి సంస్థ (SOTTO)
– సమాచారాన్ని అందించడానికి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ (1800114770)తో ఒక వెబ్ సైట్, 24*7 కాల్ సెంటర్.
– అవయవదానం సమన్వయంలో సహాయం కోసం టెలి కౌన్సెలింగ్.
అవయవ మార్పిడి కోసం మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో అత్యాధునిక బహుళ అవయవ మార్పిడి కేంద్రాన్ని నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం 35 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరిన్ని అవయవ మార్పిడి శస్త్ర చికిత్సల కోసం ఒత్తిడి చేస్తూనే.. తెలంగాణ ప్రభుత్వం కూడా జిల్లా ఆసుపత్రుల నుంచి హైదరాబాద్ లోని ఆసుపత్రులకు బ్రెయిన్ డెడ్ రోగులు దానం చేసిన అవయవాలను రవాణా చేయడానికి చాపర్ లను ఉపయోగిస్తున్నది.