మహిళా సర్పంచిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యవహారం ముదురుతోంది. ఆయనను కఠినంగా శిక్షించాలంటూ తెలంగా కాంగ్రెస్ నిరసన చేపట్టింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆధ్వర్యంలో శనివారం గాంధీ భవన్ మెయిన్ రోడ్డుపై రాజయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు.
జనగాం జిల్లా ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ కురసపేల్లి నవ్యను తన కోరిక తీర్చాలని రాజయ్య వేధించినట్లు ఆరోపణలు రావడం తెలిసిందే. అలాంటి మనిషి ఎమ్మెల్యే పదవిలో కొనసాగడం సిగ్గు చేటమని కాంగ్రెస్ మహిళా నేతలు విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మహిళల రక్షణ కోసం ఢిల్లీలో ఆందోళన చేస్తుంటే తెలంగాణలో ప్రజాప్రతినిధిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న తాటికొండ రాజయ్యను ఏం చేస్తారని మహిళా కాంగ్రెస్ కోఆర్డినేటర్ నీలం పద్మ ప్రశ్నించారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు కావాలని ఢిల్లీలో దీక్ష చేసిన కవితకు మద్దతిస్తున్నామని, అదే సమయంలో మహిళలను వేధిస్తున్న రాజయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ ఒక్క సంఘటనే కాదు ఇంకా జడ్పీ చైర్మన్ ల పైన. మున్సిపల్ చైర్మన్ ల పైన. ఎంపీపీల పైన జడ్పిటిసి ల పైన అనేక విధాలుగా ఏదో రకంగా వాళ్ళని ఏడిపిస్తూ వేధిస్తున్నారని మండిపడ్డారు. మహిళలోకానికి బే షరతుగా ఎమ్మెల్సీ కవిత మహిళా మంత్రులు మహిళా ఎమ్మెల్యేలు నవ్యకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణ మహిళలు అందరూ రోడ్లపై కు వచ్చి చీపురు. చాటలతో బిఆర్ఎస్ ప్రభుత్వ నాయకులను వారు తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు.