షార్జాలో తెలంగాణ వ్యక్తి దారుణ హత్య - MicTv.in - Telugu News
mictv telugu

షార్జాలో తెలంగాణ వ్యక్తి దారుణ హత్య

May 26, 2020

vgmn vbhn

ఉపాధి కోసం పోట్ట చేత పట్టుకొని దేశం కాని దేశం వెళ్లి కుటుంబాన్ని పోషించాలని అనుకున్నాడు. కానీ అంతలోనే విధి వక్రించి దారుణ హత్యకు గురయ్యాడు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన నవీన్ అనే  వ్యక్తి కత్తిపోట్లతో చనిపోయాడు. తోటి కార్మికుడితో జరిగిన గొడవ ఈ హత్యకు దారి తీసినట్టుగా తెలుస్తోంది.  దుబాయ్‌లోని షార్జాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కొడుకు ప్రయోజకుడు అవుతాడంటే ఇలా అర్థాంతరంగా ఆయువు తీరడంతో తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

దేశవేని నర్సయ్య, రాధ రెండో కుమారుడు నవీన్‌(28) ఆరు నెలల క్రితం ఉపాధి కోసం యూఏఈ వెళ్లాడు. ఓ కార్ వాషింగ్ సెంటర్‌లో పనికి కుదిరాడు. ఈ నెల 23న రాత్రి తన గదిలో నవీన్‌ భోజనం చేస్తుండగా.. కేరళకు చెందిన వ్యక్తితో ఘర్షణ జరిగింది.  దీంతో నవీన్‌పై ఆ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. పలుమార్లు  పొడవడంతో తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సమాచారాన్ని అధికారులు ఇంటికి సమాచారం అందించారు. తమ కొడుకు మృతదేహాన్ని అయినా ఇంటికి పంపించాలని కోరతున్నారు.