మృతుల్లో మావోయిస్టు రాష్ట్ర సెక్రటరీ జగన్! - MicTv.in - Telugu News
mictv telugu

మృతుల్లో మావోయిస్టు రాష్ట్ర సెక్రటరీ జగన్!

March 2, 2018

భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ మావోయిస్టు కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ హరిభూషణ్, అలియస్ జగన్ చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో అతడు ఉన్నాడని ఛత్తీస్‌గఢ్  సుక్మాజిల్లా ఎస్పీ తెలిపారు. అయితే తెలంగాణ పోలీసులు దీనిపై ఇంకా స్పందించలేదు.చొక్కారావుతోపాటు మరో ఇద్దరు అగ్రనేతలు కూడా చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటనాస్థలంలో రెండు ఏకే 47 తుపాకులు దొరికాయని, అవి అగ్రనేతల వద్దే వుంటాయి కనుక మృతుల్లో వారు కూడా ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. మృతదేహాలను భద్రాచలం ఆస్పత్రికి తరలిస్తున్నామని, బంధువులు గుర్తుపట్టాక పూర్తి వివరాతుల తెలుస్తాయని పేర్కొంటున్నారు. ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో పోలీసులు చుట్టుపక్కల గ్రామాలను జల్లెడ పడుతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.