తెలంగాణ అమరవీరుల స్తూపం డిజైన్ ఇదే - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ అమరవీరుల స్తూపం డిజైన్ ఇదే

February 21, 2018

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్తూపం డిజైన్ ఖరారైంది. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ ఒడ్డున్న ఏర్పాటు చేయనున్న ఈ స్తూపం డిజైన్‌కు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. పలు డిజైన్లు రాగా, ప్రమిద ఆకృతిలో ఉన్న డిజైన్‌ను ఖరారు చేశారు.  జ్వలిస్తున్న దీపం ఆకృతిల ఈ భారీ స్తూపాన్ని నిర్మిస్తారు. దీనికోసం మార్చి మొదటి వారంలో ప్రభుత్వం టెండర్లు పిలుస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత సుందరంగా స్తూపాన్ని, దాని పరిసరాలను తీర్చిదిద్దాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సచివాలయం ఎదురుగా ఉన్న 12 ఎకరాల స్థలంలో ఈ స్తూపాన్ని ఏర్పాటు చేసి, పర్యాటక ప్రాంతంగా మారుస్తారు.     

https://twitter.com/ANI/status/966162725880696832