Telangana Medical Health Services Recruitment Board has given good news to the unemployed in the state
mictv telugu

నిరుద్యోగులకు TMHSRB గుడ్ న్యూస్… దరఖాస్తు గడువు పొడిగింపు

February 16, 2023

తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు వేర్వేరు విభాగాల్లో 5,204 స్టాఫ్‌నర్సు పోస్టులను భర్తీ చేయడానికి టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ(TMHSRB).. విడుదల చేసిన దరఖాస్తు గడవును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకుముంద అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసేందుకు లాస్టే డేట్‌ను తొలుత ఫిబ్రవరి 15న సాయంత్రం 5 గంటలుగా ప్రకటించారు. అయితే వివిధ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో జాప్యం చోటుచేసుకుంటున్న నేపథ్యంలో గడువు పొడిగించాలన్న అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ గడువును ఫిబ్రవరి 21 వరకు పొడిగించింది టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ.

వైద్యారోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 30 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంఎన్‌జే సంస్థల్లో 81, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 127, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ విభాగంలో 8, మహాత్మాజ్యోతిబా పూలే విద్యా సంస్థల్లో 197, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థల్లో 74, తెలంగాణ సోషల్ వెల్ఫేర్‌లో 124, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్‌లో 13 పోస్టులు భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు ప్రక్రియ

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.620 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.500 పరీక్ష ఫీజు, రూ.120 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, నిరుద్యోగులకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ విధానంలోనే ఫీజు చెల్లించాలి.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 21వ తేదీలోగా https://mhsrb.telangana.gov.in/వెబ్ సైట్లో సమర్పించాలని అధికారులు సూచించారు.

ఎంపిక విధానం
రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలో అన్నీ బహుళ ఐచ్ఛిక (మల్టీపుల్‌ ఛాయిస్‌) ప్రశ్నలే ఉంటాయి.
అర్హత
జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీ (GNM) లేదా బీఎస్సీ (నర్సంగ్). తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి. సర్టిఫికేట్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
వయోపరిమితి
01.07.2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే ఒప్పంద, పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న అభ్యర్థులకు వెయిటేజీ ఇవ్వనున్నారు. వీరికి వేతనం స్కేలు రూ.36,750-1,06,990గా పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్లు అన్నీ కూడా వర్తిస్తాయి. స్థానిక అభ్యర్థులకు 95% రిజర్వేషన్‌ ఉంటుంది.