ఎంబీబీఎస్ సీటు రావడం తలకిందులుగా తపస్సు చేయడం వంటింది మొన్నటి వరకు. ఇప్పుడు అదంతా గతం. లక్షల్లో ర్యాంకు వచ్చినా సులభంగా సీటు వచ్చేస్తోంది. తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో లోకల్ రిజర్వేషన్లు అమల్లోకి రావడంతో ఇది సాధ్యమైంది. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)లో లక్షల్లో ర్యాంకులు వచ్చిన విద్యార్థులు సీటు ఈజీగా వస్తోంది. 8.78 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు రావడం ఈసారి విశేషం.
బీ కేటగిరీలో 85 శాతం లోకల్ రిజర్వేషన్, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సీట్ల సంఖ్య పెరిగి, ఆశావహుల కలలు నెరవేరుతున్నాయి. 2,28,094వ ర్యాంకు వచ్చిన విద్యార్థికి కన్వీనర్ కోటాలో సీటు దక్కింది. గత ఏడాది 1.96 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి కన్వీనర్ కోటాలో సీటు లభించింది. 2022-23లో బీ కేటగిరీలోని 1,267 సీట్లలో స్థానిక రిజర్వేషన్ వల్ల రాష్ట్ర విద్యార్థులకు 1,071 సీట్లు దక్కాయి. ఫలితంగా 8.78 లక్షల ర్యాంకు వచ్చిన తెలంగాణ విద్యార్థికి సీటు వచ్చింది. 2021-22లో కన్వీనర్ కోటా.. ఏ కేటగిరీలో 3,038 సీట్లు ఉండగా, ఈ ఏడాది 4,094కు పెరిగింది. ఫలితంగా ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల్లో కటాఫ్ తగ్గి ఎక్కువ మందికి సీట్లు వచ్చాయి.