తెలంగాణ : 100కు ఫోన్ చేసి రెండు బీర్లు తెమ్మన్నాడు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ : 100కు ఫోన్ చేసి రెండు బీర్లు తెమ్మన్నాడు

May 9, 2022

ఆపదలో ఉన్నవారు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ప్రభుత్వం పెట్టిన 100 వ్యవస్థను కొందరు దుర్మార్గులు దుర్వినియోగం చేస్తున్నారు. ఆదివారం రాత్రి రెండు గంటలకు ఓ వ్యక్తి ఆపదలో ఉన్నాను రక్షించండి అని ఫోన్ చేయడంతో పోలీసులు హుటాహుటిన అతను ఉన్న చోటికి వెళ్లగా, తనకు రెండు బీర్లు కావాలంటూ వాటిని తెచ్చిమ్మని కోరాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాడ్ గ్రామానికి చెందిన జనిగెల మధు అనే వ్యక్తి ఈ పనికి పాల్పడ్డాడు. డ్యూటీలో ఉన్న పోలీసుల సమయం వృథా చేయడంతో పాటు 100ను దుర్వినియోగం చేసినందుకు అతడిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు చెప్తున్నారు.