కేంద్ర మంత్రిపై తెలంగాణ మంత్రి ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్ర మంత్రిపై తెలంగాణ మంత్రి ఫైర్

December 22, 2021

06

కేంద్ర మంత్రి పియూష్ గోయల్ పై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ రైతుల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని, తెలంగాణ రాష్ట్ర రైతులకు న్యాయం చేయండి అంటూ మంత్రులు ఢీల్లీకి వస్తే, కనీసం సమయం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ రైతులకు కేంద్రం అన్యాయం చేస్తున్నందుకు మీరందరు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా, తెలంగాణ మంత్రులపై వారికి ఏ పని లేదా అంటావా అంటూ ఆవేదన చెందారు. ఎంతో ప్రాధాన్యత ఉంటే తప్పా అంత మంది మంత్రులు ఢీల్లీకి రారాన్నారు. తమ గురించి ఇంత నీచంగా మాట్లాడే నైతికత మీకెక్కడిదని హరీష్ రావు ప్రశ్నించారు. మీకు తెలంగాణ రైతుల ఓట్లు కావాలి కానీ, వారి వడ్లు వద్దా.. అంటూ పేర్కొన్నారు. ఈ విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని, అందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.