తెలంగాణ మంత్రి హరీశ్ రావును అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. సోషల్ మీడియా వేదికగా గ్రీటింగ్స్ చెబుతున్నారు. ఓ అభిమాని వినూత్నంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతంపై నుంచి శుభాకాంక్షలు తెలిపారు.
భువనగిరికి చెందిన పర్వతారోహకురాలు పడమటి అన్వితా రెడ్డి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. హరీశ్ రావు జన్మదినాన్ని గుర్తు చేసుకుని మరీ 29 వేల అడుగుల ఎత్తు నుంచి ఆమె గ్రీటింగ్స్ చెప్పారు. అన్విత ప్రపంచంలోని టాప్ 5 పర్వాతాలు ఎక్కిన మహిళగా రికార్డు సృష్టించారు.