మంత్రి హరీశ్ రావు మాట ఇచ్చాడు అంటే..మడమ తిప్పే ప్రసక్తే లేదు. ఏదైనా ఆలోచన ఆయనకు వచ్చింది అంటే ఆచరణలోకి రావడం..అమలు పరచడం వెంటనే జరిగిపోతుంది. అదే విషయాన్ని హరీష్ రావు మరోసారి నిరూపించారు . నిన్న సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి జిల్లాలోని గ్రంథాలయాన్ని సందర్శించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న యువతి యువకులతో హరీశ్ రావు కాసేపు ముచ్చటించారు. లైబ్రరీ ఎలా ఉపయోగపడుతుంది, మీకు అవసరమైన బుక్స్ అందుబాటులో ఉన్నాయా..అంటూ విద్యార్ధుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
మీరు బాగా చదువుకుని, మీ తల్లిదండ్రులకు, సిద్దిపేటకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. అంతే కాదు ప్రతి రోజు లైబ్రరీకి వచ్చి చదువుకునే విద్యార్ధులకు భోజన సదుపాయం కల్పిస్తానని మాటిచ్చారు. 24 గంటల పాటు గ్రంథాలయంలో చదువుకోవచ్చని ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పారు.
సోమవారం రాత్రి భోజనం పెట్టిస్తాని మాట ఇచ్చిన వెంటనే ఈ రోజు నుంచే విద్యార్ధులకు భోజనం అందిస్తున్నారు. ప్రతి రోజు లైబ్రరీలో చదువుకునే 400 మంది యువతీ యువకులకు తన సొంత ఖర్చులతో భోజనం పెట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు మంత్రి హరీశ్ రావు.