ఆక్సిజన్ కొనాలంటే రూ. 5 కోట్లు అవుతుంది..మంత్రి హరీష్ రావు - MicTv.in - Telugu News
mictv telugu

ఆక్సిజన్ కొనాలంటే రూ. 5 కోట్లు అవుతుంది..మంత్రి హరీష్ రావు

August 1, 2020

Telangana minister harish rao participated in sixth edition of haritha haram

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు‌ సిద్ధిపేట జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్ధిపేట అడవుల్లో పచ్చదనం పెంచేందుకు వినూత్న ప్రయత్నం ప్రారంభించారు. అడవిలో మనుషులు వెళ్లలేని చోట డ్రోన్ ద్వారా సీడ్ బాల్స్ (విత్తన బంతులు) చల్లే కార్యాక్రమాన్ని ప్రారంభించారు.  పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..’ప్రకృతికి సేవ చేస్తే మనుషులకు చేసినట్టే. మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడితే మంచి గాలి వస్తుంది. ఇప్పటికే ఢీల్లీ లాంటి నగరాల్లో ఆక్సిజన్ లేక కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఒక్కరోజు మనిషి పీల్చే గాలి 3 ఆక్సిజన్ సిలిండర్లు, ఒక్కో సిలిండర్ ఖర్చు 700 రూపాయలు, ఈ లెక్కన మూడు సిలిండర్లకు 2100 ఖర్చు అవుతుంది. ఈ లెక్కన ఒక మనిషి జీవిత కాలంలో పీల్చే ఆక్సిజన్ కొనుగోలు చేస్తే.. 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. చెట్లు ఉచితంగా ఆక్సిజన్ ఇస్తున్నాయి. వనజీవి రామయ్య గారి జీవితం అందరికి ఆదర్శనీయం. వారు కోటికి పైగా మొక్కలు నాటారు. అడవుల్లో మనుషులు వెళ్ల లేని చోట ఉన్న ఖాళీ ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకే డ్రోన్ వినియోగిస్తున్నాం. సీడ్ బాల్స్ లో కోతులకు ఆహారం ఇచ్చే చెట్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం పెంపు కోసం అధిక ప్రాధామ్యం ఇస్తోంది. గత ప్రభుత్వాలు అడవుల్లో చెట్లు నరికితే.. టీఆర్ఎస్ ప్రభుత్వం అడవుల్లో మొక్కలు నాటి చెట్లు పెచుతోంది.’ అని అన్నారు. 

అలాగే వనజీవి రామయ్య మాట్లాడుతూ..’అడవుల్లో పచ్చదనం పెంచడానికి సీడ్ బాల్స్ మంచి ప్రయత్నం. సహజంగా మొలకెత్తిన మొక్క బలంగా పెరుగుతుంది. చెట్టు కన్నతల్లి లాంటింది. లాటరీ టికెట్ కొంటె లాభం వస్తదో రాదో తెలియదు. కానీ మొక్క నాటితే పండ్లు, నీడ, గాలి ద్వారా లాభం వస్తుంది. నీటిలో చేప ఉన్నట్టుగా.. భూమిలో పండ్లు ఉన్నాయి. చేపను బయటకు తీయడానికి గాలం వేసినట్టు.. భూమిలోని పండ్లను బయటికి తీయడానికి మొక్క నాటలి. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ విధ్వంసం పరుగులు తీస్తోంది. ప్రతి రోజు 50వేల హెక్టర్ల విస్తీర్ణంలో అడవి అంతరించిపోతుంది. శాశ్వత ప్రాతిపదికన మనం బతకాలంటే.. మొక్కలు నాటి వృక్షాలుగా చేయాలి.’ అని తెలిపారు.