గొల్ల కురుమల గౌరవాన్ని టీఆర్ఎస్ ఆకాశమంత ఎత్తులో నిలబెట్టింది.. హరీశ్ రావు - MicTv.in - Telugu News
mictv telugu

గొల్ల కురుమల గౌరవాన్ని టీఆర్ఎస్ ఆకాశమంత ఎత్తులో నిలబెట్టింది.. హరీశ్ రావు

October 26, 2022

గొల్ల కురుమలు ధర్మంవైపు నిలబడే సమూహమని తెలంగాణ మంత్రి హరీశ్ రావు కొనియాడారు.ఎన్నికల్లోనూ వారు ధర్మంపై నిలబడి టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లోని మన్నెగూడలో జరిగిన గొల్ల కురుమల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.

యాదవులను కలిసినప్పుడు ఏదో ఆత్మీయత కనిపిస్తుందని, వారు మడమ తిప్పని యోధులని మంత్రి ప్రశంసించారు. ‘‘సీఎం కేసీఆర్ గారు గొల్ల కురుమల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి వాళ్లను పరిపాలనలో,అభివృద్ధిలో భాగస్వాములను చేశారు. రుణ భారం లేకుండా 75% సబ్సిడీతో గొల్ల కురుమలకు గొర్రెపిల్లలు ఇచ్చిన ఘనత ఆయనదే. ఆయన గొల్ల కురుమల ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టారు. ఇవాళ హైదరాబాదులో గొల్ల కురుమలకు అద్భుతమైన ఆత్మగౌరవ భవనం ఉంది. ఎకరం 100 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని గొల్ల కురుమలకు కేసీఆర్ బహుమానంగా ఇచ్చారు. టిఆర్ఎస్ పార్టీకి కెసిఆర్ గారికి గొల్ల కురుమలంతా మద్దతు ఇవ్వాలి. ధర్మం వైపు నిలబడి ధర్మాన్ని గెలిపించాలని కోరుతున్నాను.’ అని హరీశ్ రావు కోరారు.

తెలంగాణ రాకముందు రాష్ట్రంలో గొల్ల కురుమల పరిస్థితి బాగుండేదని కాదని, ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు. దేశంలో తెలంగాణ పథకాలే అద్భుతంగా ఉన్నాయని కేంద్రం కూడా ప్రశంసించిందని చెప్పారు. గొల్ల కురుమల సంక్షేమం కోసం పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎల్లవేళలా యాదవుల ఆశీర్వాదం ఉండాలని కోరారు.