Telangana minister harish rao slam bjp stand over trs mlas purchase case
mictv telugu

ఇజ్జత్ పోతుందనే బీజేపీ కోర్టుకెళ్లింది.. ఫాహ్‌హౌస్ కేసుపై హరీష్ రావు

November 10, 2022

Telangana minister harish rao slam bjp stand over trs mlas purchase case

ఎనిమిది రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు దొంగదారిలో పడగొట్టిన బీజేపీ, తెలంగాణలోనూ ఆ ప్రయత్నం చేసి కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటోందని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించిన దొంగలను పట్టుకుని జైల్లో వేయడంతో కమలనాథులు ఆగమాగమవుతున్నారని, ఇజ్జత్ పోతుందనే కోర్టుకెక్కుతున్నారని విమర్శించారు.

ఫామ్ హౌస్ కేసుపై ఆయన గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.‘‘గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారు. తాము ఏ తప్పూ చేయలేని బండి సంజయ్ తడి బట్టలతో ప్రమాణాలు చేస్తనంటడు. ప్రధాన కార్యదర్శి మాత్రం కోర్టుల్లో కేసులు వేస్తడు. విచారణ ఆపండి, ఈ కేసు ఢిల్లీకి ఇవ్వండి అంటడు. మాకు సంబంధం లేదంటూనే కోర్టుకెక్కుతారు. ఏదో లింకు లేకపోతే ఎందుకు కోర్టుకు పోతున్నరు?’’ అని హరీశ్ ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుల మీద, ఐపీఎస్ అధికారుల మీద నమ్మకం లేకపోతే ఓట్లు వేయాలని తెలంగాణ ప్రజలను ఎందుకడుతున్నారని నిలదీశారు. ‘‘తెలంగాణ పోలీసులు ఏం చేశారు. దొంగను పట్టుకోవడం తప్పా? నిస్సిగ్గుగా మేం ఎమ్మెల్యేలను కొంటమని వస్తే పోలీసులు పట్టుకుంటే విచారణ ఆపాలని, దొంగలను పట్టుకోవద్దని బీజేపీ నేతలు మాట్లాడతరా?’’అని ప్రశ్నించారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘మంత్రి ఎమ్మెల్యేల కొనుగోలుపై కచ్చితంగా విచారణ జరుగుతుంది. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన నడుస్తున్నది. మా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే ఊరుకోం’ అని అన్నారు.