పుట్టినరోజున తిరుమల కొండ ఎక్కిన హరీశ్ రావు - MicTv.in - Telugu News
mictv telugu

పుట్టినరోజున తిరుమల కొండ ఎక్కిన హరీశ్ రావు

June 3, 2022

పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గురువారం రాత్రి అలిపిరి నుంచి కాలినడక తిరుమల చేరుకున్న ఆయన ఉదయం తలనీలాలు సమర్పించుకుని శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. పుట్టిన రోజు సందర్భంగా తనను అభినందించడానికి ఎవరూ కూడా సిద్దిపేటకు గాని, హైదరాబాద్ కు గాని రావొద్దని ఆయన ఇదివరకే సూచించారు. దాని బదులు పేదలకు సేవా కార్యక్రమాలు చేయాలని విజ్ఞప్తి చేశారు.