ఏపీ రాజధానిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ రాజధానిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

January 17, 2020

minister ktr.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల అంశంపై అమరావతి రైతులు నిరసన వ్యక్తం వ్యక్తం చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో జిల్లాల ఏర్పాటును ప్రస్తావించారు.

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో కొత్తగా 33 జిల్లాలు ఏర్పాటు చేశాం. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా వ్యతిరేకత రాలేదు. తెలంగాణలో పరిస్థితి అలా ఉంటే.. ఏపీ రాజధాని విషయంలో వ్యతిరేకత ఎందుకు వస్తుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ రాజధాని అంశంపై కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. నాలుగు రోజుల క్రితమే ఏపీ సీఎం జగన్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అలాగే మంత్రి కేటీఆర్‌ను కలిశారు. మూడు రాజధానుల అంశం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. కేసీఆర్ కూడా మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థించినట్లు వార్తలు వినిపించాయి. ఇలాంటి సందర్భంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతోన్నాయి.