పోలీసులు ఆ మృగాళ్లను పట్టుకుంటారు..కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసులు ఆ మృగాళ్లను పట్టుకుంటారు..కేటీఆర్

November 29, 2019

గురువారం రోజున రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి సజీవ దహనం చేసిన సంగతి తెల్సిందే. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విటర్లో స్పందించారు. 

 

‘ఈ దారుణానికి ఒడిగట్టిన మృగాళ్లను పోలీసులు పట్టుకుంటారని నమ్మకం ఉంది. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందేలా చేస్తాం. కేసును నేనే పర్సనల్‌గా మానిటరింగ్‌ చేస్తున్నా. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే డయల్‌ 100కి ఫోన్‌ చేయాలని’ కేటీఆర్‌ సూచించారు. ప్రియాంకను నలుగురు గ్యాంగ్ రేప్ చేశారని పోలీసులు నిర్దారించారు. వారిని మహబాబ్ నగర్, రంగారెడ్డి జిల్లా వాసులుగా గుర్తించారు. వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంకను దుప్పటిలో చుట్టి కిరోసిన్ పోసి తగలబెట్టారని తెలుస్తోంది.