మహాకూటమి ఓ జఫ్ఫా కూటమి.. టీజేఎస్ భజన సమితి.. కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

మహాకూటమి ఓ జఫ్ఫా కూటమి.. టీజేఎస్ భజన సమితి.. కేటీఆర్

October 6, 2018

తెలంగాణ మంత్రి కేటీఆర్ మహాకూటమిపై నిప్పులు చెరిగారు. శనివారం భవన్‌లో నిర్శహించిన టీఆర్ఎస్ విద్యార్థి విభాగం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులంతా పోరాడుతుంటే.. ఇంట్లో దాక్కున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సైనికుడు ఎలా అవుతాడని ఎద్దేవా చేశారు.

ttt

కాంగ్రెస్ పార్టీ నాయకులకు బలుపు ఎక్కువని, మంత్రి పదవి కోసం ఉత్తమ్ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి కాళ్లు పట్టుకున్నాడని విమర్శించారు. తాము గట్టిగా మాట్లాడితే.. బచ్చాగాళ్లు అని కొందరు విమర్శిస్తున్నారని.. ఈ బచ్చాగాళ్లే తెలంగాణ కోసం కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. తెలంగాణ కోసమే కాంగ్రెస్, టీడీపీలతో టీఆర్‌ఎస్ గతంలో పొత్తు పెట్టుకుందని కేటీఆర్ పేర్కొన్నారు.

‘అది మహాకూటమి కాదు.. ఓ జఫ్ఫా కూటమి. అది గెలిస్తే మన ప్రాజెక్టులు పూర్తి అవుతాయా? మనకు ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలను కొట్టే అవకాశం వచ్చింది..దీన్ని బాగా వాడుకుుని, మహాకూటమిని తరిమికొట్టాలి…’ అని కోరారు. కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితికాంగ్రెస్ భజన సమితిగా మారిపోయిందని ధ్వజమెత్తారు. ప్రగతి భవన్ కోట గడులు పగులగొడతామన్న కోదండరాం.. ఇప్పుడు గోడలు గీస్తున్నాడని ఎద్దేవా చేశారు. అలాగే దొంగకు నొరెక్కువ అన్నట్టు ఒకాయన ధూమ్ ధూమ్ అంటున్నాడని పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఎన్నెన్ని వింత హామీలు ఇస్తుందో అని సెటైర్లు వేశారు. విద్యార్థుల ఊపు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ సెంచరీ కొట్టడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.