పార్లమెంటులో అనుచిత పదాలంటూ ఇటీవల కొన్ని పదాలను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఇదా మీ భాష? అంటూ గతంలో బీజేపీ ప్రభుత్వ నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘ప్రధాని మోదీ నిరసనకారులను ఆందోళన్ జీవి అని పిలవడం సరైనదేనా? యూపీ సీఎం యోగీ చేసిన 80 – 20 వ్యాఖ్య ఓకేనా? నిరసన తెలుపుతున్న రైతులను ఉగ్రవాదులు అనడం కరెక్టేనా? మహాత్మాగాంధీని బీజేపీ ఎంపీ కించపరచడం బాగుందా? గోలీ మారో అంటూ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు సరైనవా? అంటూ ప్రశ్నించారు. కాగా, పదాలతో పాటు శాంతియుత ధర్నాలు, నిరసనలు, మత కార్యక్రమాలు కూడా పార్లమెంటు పరిధిలో నిర్వహించడాన్ని నిషేధించారు.