కేటీఆర్‌కూ కరోనా.. ఒక్కరోజే 29 మంది బలి - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్‌కూ కరోనా.. ఒక్కరోజే 29 మంది బలి

April 23, 2021

Telangana minister ktr gets positive

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆర్‌కు కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు ప్రస్తుతం కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉన్నానని ట్విటర్లో వెల్లడించారు.

ఇటీవల కొన్ని రోజులుగా తనను కలిసిన వాళ్లంతా కొవిడ్ పరీక్షలు చేయించుకుని, జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కాగా కోవిడ్ బారిన పడిన సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కేసీఆర్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, కంగారు పడాల్సిన అవసరం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలో 6,206 మందికి కరోనా సోకింది. 3,052 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. 29 మంది మరణించారు.